ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగులపై ఎస్సై హెచ్చరిక

ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి యువతకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను వినోదంగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగుల మోజులో పడకూడదని సూచించారు. ఇటీవల బెట్టింగుల వల్ల యువత ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రాంతంలో బెట్టింగులపై ప్రత్యేక నిఘా ఉంచామని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్