నల్లగుట్టపల్లిలో వీధి కుక్కల దాడి: 14 పొట్టేళ్లు మృతి

రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి వీధి కుక్కల గుంపు బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన రైతు గంప శ్రీనివాసులు గొర్రెల కొట్టంలోకి చొరబడిన కుక్కలు, ఒకేసారి 14 పొట్టేళ్లను కొరికి చంపేశాయి. రైతు వాటిని తరిమికొట్టే లోపే ఈ ఘటన జరిగింది. అప్పు చేసి పొట్టేళ్లను పెంచుకుంటున్న నిరుపేద కుటుంబం ఈ సంఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత పోస్ట్