పాలకులే డ్రగ్స్ వాడుతున్నారు: మాజీ ఎమ్మెల్యే

రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అభినవ ధృతరాష్ట్రుడి పాలన సాగుతోందని తీవ్రంగా విమర్శించారు. మంగళవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'సూపర్ సిక్స్' హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులే డ్రగ్స్ వాడే దుస్థితి నెలకొందని, కేవలం కమీషన్ల కోసమే అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్