లక్కిరెడ్డిపల్లి మండలంలో జాతీయ రహదారి-440 విస్తరణ పనులు జరుగుతుండగా, గురువారం దొర్రి చెరువు సమీపంలో కంకర తీసుకెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.