గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి హయాంలో బలహీన, బడుగు, పేద వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని తెలిపారు. బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బంకు సుబ్బయ్య, రాయచోటి పట్టణ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా నాగేంద్ర నియామకాన్ని పురస్కరించుకుని శాలివాహన (కుమ్మర) సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డిని సత్కరించారు. వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు న్యాయం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం రామాపురం మండలం బండపల్లె బైనేని హరిజనవాడ వాసులతో శ్రీకాంత్ రెడ్డి మమేకమయ్యారు.