వెలిగల్లు ప్రధాన కాలువకు గండి – సిపిఐ నాయకుడు పరిశీలన

లక్కిరెడ్డిపల్లి మండలం పందెలపల్లి గ్రామ పరిధిలో వెలిగల్లు ప్రధాన కాలువకు కొంతమంది జేసీబీలతో గండి కొట్టి నీటిని పక్కదారి మళ్లిస్తున్న ఘటనను సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, కాలువను నాశనం చేస్తూ నీటిని మళ్లించడం రైతులకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని, ఇలాగనే ఉంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్