రాయచోటి కంచాలమ్మ గండిచెరువుకు జలహారతి-లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

రాయచోటి రూరల్ మండలం ఎగువ అబ్బవరం గ్రామంలోని కంచాలమ్మ గండి చెరువు ఇటీవల కురిసిన వర్షాలతో మంగళవారం నిండింది. ఈ నేపథ్యంలో టిడిపి యువ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గ్రామస్థులతో కలిసి జలహారతి ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చెరువులు, చెక్ డ్యామ్‌లు నీటితో నిండిపోవడం రైతులకు ఆనందం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చన విద్యాసంస్థల డైరెక్టర్ పి. మదన్మోహన్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్