ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

చిన్నమండెం మండలం పడమటికొన గ్రామం బోరెడ్డిగారి పల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు రహదారులు, తాగునీరు, విద్యుత్, పింఛన్లు, రేషన్ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి సమస్యలను ఓర్పుతో విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్