గాలివీడు మండలం గరుగుపల్లి పంచాయతీ ఇడుపుల చేనుపల్లిలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో పందుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సాయికుమార్ రెడ్డి (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకున్న సాయికుమార్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.