శుక్రవారం రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా భారీ ర్యాలీ జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్‌ఎన్ కాలనీ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు వేలాదిమంది పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అమ్మఒడి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.