T-Hubలో ఎస్. తస్నీం ఫిర్డోస్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

కడప, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన BBA 2nd ఇయర్ విద్యార్థిని ఎస్. తస్నీం ఫిర్డోస్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని ఎస్. తస్నీం ఫిర్డోస్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు. ఎస్. తస్నీం ఫిర్డోస్ మాట్లాడుతూ
"తెలుగు AI బూట్ క్యాంప్‌లో పాల్గొనడం ఒక అద్భుతమైన అనుభవం. ఇది నా అపేక్షలకు మించిన గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇందులో నెట్‌వర్క్ విస్తరించుకోవడం, నిపుణుల వద్ద నుండి కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా విశేషమైన మార్గదర్శనం పొందానన్నారు. ఈ దశలో ఇంతటి మోటివేషన్, ఎనర్జీ, ప్రోత్సాహం పొందడం తనకు చాలా ప్రత్యేకంగా అనిపించిందిన్నారు.వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.

సంబంధిత పోస్ట్