అన్నమయ్య: బైక్ దొంగకు జైలుశిక్ష

అన్నమయ్య జిల్లాలో బైక్ దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు 9 నెలల జైలుశిక్ష విధించింది. ములకలచెరువు, బురకాయలకోట ప్రాంతాల్లో మూడు బైకులు దొంగిలించబడ్డాయి. ఈ కేసులో పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన వెంకటరెడ్డిని పోలీసులు గుర్తించి, 2025 అక్టోబరులో అప్పటి ఎస్ఐ నరసింహుడు అరెస్టు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బుధవారం ఈ శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్