బి. కొత్తకోటలో ఎయిడ్స్ దినోత్సవం

బి. కొత్తకోటలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని స్థానిక వైద్య సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఆరిఫ్‌ల్లా మాట్లాడుతూ, ఎయిడ్స్‌కు చికిత్స అందుబాటులో ఉందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. సుఖ వ్యాధుల ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో కలిసి పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్