బి. కొత్తకోట మండలం కనికలతోపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మదనపల్లి ఎగువ కురవంకకు చెందిన ఆటో డ్రైవర్ కిషోర్ (24), రవితేజ (24) తమ బైక్‌పై ములకలచెరువు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరినీ స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.