అన్నమయ్య: భర్త మద్యం తాగుతున్నాడని భార్య ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చేరింది. పోలీసుల కథనం మేరకు బి. కొత్తకోట మండలం మొటుకు గ్రామం పులుసుమాను పెంటకు చెందిన శివశంకర్ రోజు మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని భార్య లక్ష్మిదేవి శుక్రవారం ఉదయం భర్తను నిలదీసింది. శివశంకర్ భార్యతో గొడవ పడడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మయత్నానికి పాల్పడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్