తంబళ్లపల్లెలో బైక్ ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

బుధవారం తంబళ్లపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లపల్లె వారిపల్లెకు చెందిన సదాశివ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. నల్లగడ్డ బావి వద్ద కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆయనను తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్