బుధవారం రామసముద్రం మండలంలోని తిరుమలపల్లి గ్రామంలో 12 ఏళ్ల మహమ్మద్ అనే బాలుడు గడ్డి కత్తిరించే యంత్రం (చాప్ కట్టర్) బారిన పడి తీవ్రంగా గాయపడ్డాడు. నడుస్తున్న యంత్రంలో ప్రమాదవశాత్తు చేయి పెట్టడంతో బాలుడి కుడి చేయి పూర్తిగా నలిగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి, అతడిని చికిత్స కోసం మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.