ఆదివారం, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముదివేడులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా, టీడీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాస్వామ్యంలో హద్దులు దాటిన వ్యాఖ్యలు సరికాదని సురేంద్ర యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.