వైయస్సార్సీపీలో ఏకాభిప్రాయంతోనే కమిటీ ఎన్నికలు

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైయస్సార్సీపీ సంస్థాగత ఎన్నికలు పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయంతోనే జరుగుతాయని మండల అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి, జడ్పిటిసి రామచంద్ర యాదవ్, అడ్వైజర్ నాగిరెడ్డిలు తెలిపారు. ఆదివారం తుమ్మణంగుట్ట గ్రామ కమిటీ ఎన్నికలు ఎమ్మెల్యే పెద్దరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా రామక్క గారి అమర్ నాథ్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, కే. హాసనప్ప బీసీ వింగ్ అధ్యక్షుడిగా, ఆర్. మనోహర్ రెడ్డి రైతు విభాగ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు పార్టీ శ్రేణుల అభిప్రాయంతోనే జరుగుతాయని నాయకులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్