పెద్దమండెం కేజీబీవీ విద్యార్థిని మృతి: మండలంలో కలకలం

పెద్దమండెం కేజీబీవీలో చదువుతున్న ముసలికుంటకు చెందిన ఓ విద్యార్థిని జ్వరంతో బుధవారం మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాలికకు జ్వరం రావడంతో సిబ్బంది తల్లిదండ్రులను పిలిచి ఇంటికి పంపించారని, ఇంటికి వెళ్లే క్రమంలో పరిస్థితి విషమించి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్