మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌కు క్షేత్రస్థాయి పరిశీలన

కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అవకాశాలను జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రైల్వే అనుసంధానం, అందుబాటులో ఉన్న భూమి, రవాణా సౌకర్యాలను పరిశీలించి గిడ్డంగులు, సివిల్ సప్లైస్ నిల్వ కేంద్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సదుపాయాలపై చర్చించారు. స్థల అవసరం, భూసేకరణ, సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, ఆమోదం అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్