కురబలకోటలో వడగళ్ళ వర్షం – వేడికి ఉపశమనం

కురబలకోటలో బుధవారం ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, సాయంత్రం 4:30 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారి వడగళ్ల వాన కురిసింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం చల్లదనాన్నిచ్చి ఉపశమనం కలిగించింది. అయితే, ఈ ఆకస్మిక వర్షం తోపుడు బండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్