పెద్దతిప్పసముద్రంలోని పీటీఎంలో వెలసిన ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కార్తీకమాసోత్సవ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో లక్ష్మీఅమ్మవారికి అభిషేకం, లలితా హోమం, సర్వమంగళ పూజ, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులచే పంచహారతి, సప్తహారతి, నక్షత్రహారతి, మహామంగళహారతి చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. 22 మహిళా భక్తులకు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.