పెద్దమండ్యం మండలం కస్తూర్భా గురుకుల పాఠశాల వాచ్ ఉమెన్ జయంతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిద్ధవరం కేజీబీవీలో పనిచేస్తున్న ఆమె, ప్రిన్సిపల్, ఎంఈఓ-2 వేధింపుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగం తొలగించి, జీతం నిలిపివేసిన మనస్తాపంతో ఆమె విషం తాగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.