పెద్దమండ్యం మండలంలో బుధవారం పైపులైన్ వివాదం ఘర్షణకు దారితీసింది. తురకపల్లెకు చెందిన సయ్యద్ వసీమ్ పక్కవీధికి పైపులైన్ వేయించే ప్రయత్నం చేస్తుండగా, గ్రామానికి చెందిన ఇస్మాయిల్ అడ్డుకుని కొడవలితో దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో వసీమ్ గాయపడగా, స్థానికులు అతన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.