నకిలీ పాస్ పుస్తకాలతో భూమి ఆక్రమణ: బాధితురాలు పద్మ ఆవేదన

చౌడేపల్లి మండలం బోయకొండ గంగాపురానికి చెందిన పద్మ అనే మహిళ, బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో తన భూమిని నకిలీ పాస్ పుస్తకాలతో పక్క పొలం యజమాని శ్రీనివాసులు తదితరులు ఆక్రమించుకున్నారని, గుడిసెను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎస్సై, తహసిల్దార్‌లకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, చంపేస్తామని హెచ్చరిస్తున్నారని ఆమె వాపోయారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్