మదనపల్లె: కన్నకొడుకుపై తండ్రి కత్తితో దాడి

మదనపల్లె మండలంలోని సీటీఎంలో బుధవారం రక్తం పంచుకున్న కొడుకుపైనే తండ్రి కర్కశంగా దాడి చేశాడు. పెద్ద భార్య కుమారుడు ఆనంద్ నిర్మిస్తున్న ఇంటికి పునాది రాళ్లు తోలి ఇవ్వలేదన్న కోపంతో, రమణ తన చిన్న భార్య కుమారుడైన కేశవపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో కేశవకు తీవ్ర గాయాలవ్వగా, కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తండ్రిపై దాడి చేశాడంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్