మొలకలచెరువు మండలం పెద్దపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ పథకం ఇంజనీర్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. మొలకలచెరువులో విధులు ముగించుకుని బైక్‌పై మదనపల్లికి వస్తుండగా, పెద్దపాలెం సమీపంలోని బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మొలకలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.