మొలకలచెరువులో గంజాయి కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో సీఐ వెంకటేశులు, ఎస్సై పరమేష్ నాయక్ బృందం శనివారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొర్ర అర్జున్ (35)ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సుమారు 2 కేజీల ఎండు గంజాయి లభించింది. అతడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చెందినవాడిగా గుర్తించారు. 2024లో మదనపల్లికి చెందిన ఓబులేసుతో 110 కేజీల గంజాయి ఒప్పందం జరిగినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో NDPS చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.