ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్, జోగి రాములను తంబళ్లపల్లె JCJ కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపింది. నెల్లూరు జైలులో ఉన్న వీరిని మంగళవారం పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరచగా, జడ్జి ఉమర్ ఫరూక్ రిమాండ్ విధించారు. అనంతరం ఇద్దరినీ తిరిగి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.