ములకలచెరువు: కృష్ణ జింక ప్రాణాలు కాపాడిన యువకులు

ములకలచెరువు సమీపంలో ఆదివారం గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న అరుదైన కృష్ణ జింకకు చైతన్య, గగన్ అనే ఇద్దరు యువకులు ప్రథమ చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు. పట్టణ పరిసరాల్లోని ఓ స్కూల్ వద్ద తీవ్ర గాయాలతో ఉన్న జింకను గమనించిన యువకులు, స్థానికంగా అందుబాటులో ఉన్న సహాయంతో చికిత్స అందించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని జింకను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

సంబంధిత పోస్ట్