పెద్దమండెం మండలం కలిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఆంగ్ల అధ్యాపకులు జె. శ్రీనివాసులు గురువారం రాత్రి మృతి చెందారు. కలిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీనివాసులు ఇటీవల అనారోగ్యానికి గురై బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్యం మరింత విషమించడంతో తాను ఉంటున్న ఇంటిలోనే మృతి చెందినట్లు సహచర అధ్యాపకులు తెలిపారు. లెక్చరర్ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.