బి. కొత్తకోట మండలంలో కోరం లేకపోవడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. గతంలో MPPగా ఉన్న లక్ష్మీనరసమ్మపై వైసీపీ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించడంతో, సూరపువారిపల్లి ఎంపీటీసీ రాధా ప్రదీప్ రెడ్డిని తాత్కాలిక ఇన్‌చార్జ్ ఎంపీపీగా నియమించారు. బుధవారం జరగాల్సిన ఎన్నికకు ఎంపీటీసీలు హాజరుకాకపోవడంతో, గురువారం ఎన్నిక నిర్వహించేలా వాయిదా వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మదనపల్లి డీఎల్‌డీవో అమర్నాథ్ రెడ్డి తెలిపారు.