ములకలచెరువులో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

ములకలచెరువు మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 36 ఏళ్ల రాజప్ప అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన భార్య గాయత్రితో కలిసి బురుజుపల్లి నుంచి స్వగ్రామానికి బైక్‌పై తిరిగి వస్తుండగా, బురుజుపల్లె సమీపంలో టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే రాజప్పను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్