ఆదివారం రామసముద్రం చెక్‌పోస్ట్ కూడలిలో ఆర్టీసీ బస్సు రివర్స్ వేస్తూ వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనంపైకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు బైక్ నడుపుతున్న యువకుడు అప్రమత్తంగా దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చెక్‌పోస్ట్ కూడలి వద్ద వాహనాలు రివర్స్ తీయడం ప్రమాదకరమని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.