అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం శ్రీప్రసన్న పార్వతి సమేత విరూపాక్షేశ్వరస్వామి ఆలయంలో చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో వేద పండితులచే ప్రత్యేక అలంకరణతో సత్యనారాయణ స్వామికి సప్తహారతి, పంచహారతి, నక్షత్రహారతి, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామి ఆశీర్వాదాలు పొందారు.