ములకలచెరువు మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు, కదిరి రోడ్డులోని షాది మహల్ సమీపంలో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటరిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.