పీటీఎం శివాలయంలో అత్యంత వైభవంగా శివలింగమునకు ప్రత్యేక పూజలు

పెద్దతిప్పసముద్రం శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో శివాలయ సేవకులు సనగరం పట్టాభి రామయ్య ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు పంచామృతాభిషేకం, ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పండితులచే శివలింగానికి పూలతో అలంకరించి సప్తహారతి, నక్షత్రహారతి, పంచహారతి, మహా మంగళహారతి చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారం అందించారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వాముల ఆశీర్వాదాలు పొందారు.

సంబంధిత పోస్ట్