పీటీఎం, అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో వెలిసిన శ్రీ ప్రసన్న పార్వతి సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15న సోమవారం ఆలయ సేవకులు నగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా వేదపండితులచే అధిక జ్యేష్ట మాసం అమావాస్య పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి శివలింగానికి ఏకవార రుద్రాభిషేకం, కొబ్బరినీళ్ళతో అభిషేకం, చెరుకు రసంతో అభిషేకం, మామిడి పండ్లతో అభిషేకం, అనంతరం రుద్రహోమం, పూర్ణాహుతి మహామంగళహారతి నిర్వహించబడుతుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. భక్తులు ఈ పూజల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ సేవకులు పట్టాభి రామయ్య కోరారు.