ఈనెల4న పీటీఎం శివాలయంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

పీటీఎంలోని శ్రీప్రసన్న పార్వతీ సమేత విరూపాక్ష స్వామి ఆలయంలో ఈ నెల 4వ తేదీ, శనివారం స్వాతినక్షత్రం సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ సేవకులు సనగరం పట్టాభిరామయ్య తెలిపారు. సాయంత్రం 5:30 గంటలకు పంచామృతాభిషేకం, ఉయ్యాల ఉత్సవం జరగనుంది. అనంతరం వేదపండితులచే ప్రత్యేక అలంకరణ, పంచహారతి, నక్షత్రహారతి, సప్తహారతి మహామంగళహారతి వంటి పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందిస్తారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్