కొత్తకోటలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. బైపాస్ రోడ్డులో బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను కుక్కలు వెంబడించడంతో వారు అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు. ప్రతిరోజూ వాహనదారులు వీధి కుక్కల దాడులతో భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. నగర పంచాయతీ అధికారులు పన్నుల వసూలుపై చూపుతున్న శ్రద్ధ ప్రజల భద్రతపై చూపడం లేదని విమర్శించారు. ఒంటరిగా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.