తంబళ్లపల్లె: భక్తులతో కిటకిటలాడిన మల్లయ్యకొండ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాయలసీమ జిల్లాల నుంచి అశేషంగా తరలివచ్చిన భక్తజన సందోహంతో తంబళ్లపల్లె మల్లయ్యకొండ గురువారం కిటకిటలాడింది. అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తుల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు కొండ మధ్యలో వెలసిన ఏనుగు మల్లమ్మను, కొండపై ఉన్న గౌరమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్రమబద్ధంగా దర్శనాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్