పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరప్ప, షామీర్ అనే ఇద్దరు బేల్దారి కార్మికులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మద్యం సేవించిన తర్వాతే వీరు మృతి చెందారనే ప్రచారం గ్రామంలో జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.