పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

చౌడేపల్లె మండలం చిట్రెడ్డిపల్లెకు చెందిన సతీష్(25) అనే యువకుడు పుంగనూరులో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మంగళవారం ఇంటికి వచ్చి అదే రోజు సాయంత్రం పుంగనూరుకు వెళ్ళాడు. బుధవారం తెల్లవారుజామున తాను మందు తాగానని బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు అతన్ని పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్