గండేపల్లి మండలం తాళ్లూరు దాబా సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉప్పలపాడుకు చెందిన బండారు దుర్గాప్రసాద్ (38) మృతి చెందారు. జగ్గంపేట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో కిందపడిన ఆయనపై వెనుక నుంచి వచ్చిన పాఠశాల బస్సు దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.