జగ్గంపేట: పొలంలో వృద్ధుడి అనుమానాస్పద మృతి

జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం పొలంలో శుక్రవారం గెడ్డం కన్నయ్య (70) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు మాట్లాడుతూ, మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన కన్నయ్య పొలంలో మృతి చెంది ఉన్నాడనే సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డాగ్ స్కాడ్ సహాయంతో వివరాలను సేకరించి విచారణ చేపడతామని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్