జగ్గంపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

జగ్గంపేట మండలం గుర్రంపాలెం శివారున ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కా చిట్టెమ్మ (42) మృతిచెందగా ఆమె కుమారుడు బాపిరాజు గాయపడ్డాడు. స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతున్న వీరిని మట్టి ట్రాక్టర్ ఢీకొట్టింది. చిట్టెమ్మను జగ్గంపేట సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాపిరాజుకు తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘునాథరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్