గండేపల్లి మండలంలో కోతుల బెడద

గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో జగ్గమ్మ చెరువు సమీపంలో కోతుల బెడద తీవ్రమైంది. కోతులు ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను పాడుచేయడమే కాకుండా, పెంకుటిళ్లు, రేకుల షెడ్ల పైకప్పులను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్