పెట్రోల్-డీజిల్ మాఫియా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు

కాకినాడ జిల్లాలో పెట్రోల్-డీజిల్ మాఫియా స్థావరాలపై పోలీసులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. గండేపల్లి, తొండంగి, తుని రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసులు మొత్తం 5,100 లీటర్ల డీజిల్, 3,380 లీటర్ల తారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చమురు పదార్థాల మార్కెట్ విలువ సుమారు రూ. 8.48 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్