అదుపు తప్పి కారు బోల్తా

గండేపల్లి వద్ద శనివారం 216వ నంబర్ జాతీయ రహదారిపై ఒక కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తుని నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్